మొదటి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన మలయాళీ భామ పూనమ్ బజ్వా. ఈ మూవీ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్ సినిమాలలో ఈ అమ్మడు ఆడిపాడింది. అయితే ఈ మూడు సినిమాలు పూనమ్ బజ్వాకి అనుకున్న స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. దీంతో పరుగు సినిమాలో సిస్టర్ రోల్ కి ఆమె పరిమితం అయిపొయింది.ఆ చిత్రం తర్వాత తెలుగులో ఈ బ్యూటీ మరి కనిపించలేదు. అడపాదడపా మాతృభాష మలయాళంలో సినిమాలు చేసుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ బజ్వా బాగా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన హాట్ ఫోటో షూట్ లకి సంబందించిన ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.
పూనమ్ బజ్వా బికినీ ఫోటోలకి విపరీతంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గత కొంత కాలంగా ఈ బ్యూటీ ఓ దర్శకుడితో ప్రేమాయణం సాగిస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఆమెనే తన ప్రేమ విషయాన్ని ధృవీకరించింది. తెలుగు దర్శకుడు సునీల్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకుంది. తామిద్దరం డేట్ లో ఉన్నామని క్లారిటీ ఇచ్చింది. ఇక అతనితో కలిసి దిగిన ఫోటోలని కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
ఇప్పుడు ఆ న్యూస్ కాస్తా వైరల్ అయ్యింది. అయితే ఈ దర్శకుడు సునీల్ ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే సాయి తేజ్ హీరోగా తిక్క అనే ఫ్లాప్ బయటకొచ్చింది. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా ఓం త్రీడీ సినిమా కూడా కనిపించింది. కన్నడంలో చివరిగా అతను ఒక సినిమా తెరకెక్కించారు. తెలుగులో కళ్యాణ్ రామ్ ఓం సినిమాతో సునీల్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కమర్షియల్ యాడ్స్ దర్శకుడిగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పూర్తిగా లుక్ మార్చేసి పూనమ్ బజ్వాతో చెట్టాపట్టాల్ వేసుకొని ఇతను తిరుగుతున్నాడు. త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.