రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు. అయిన కూడా సినిమాల విషయంలో తన హవా మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతకి జోడీగా ఖుషి మూవీని విజయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత విజయ్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ రెండు కాకుండా రీసెంట్ గా సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉండబోతుంది.
ఇక విజయ్ నెక్స్ట్ ఈ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. లైగర్ సినిమా తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన సినిమా షూటింగ్ ని విజయ్ స్టార్ట్ చేశాడు. కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే లైగర్ ఫ్లాప్ తో నిర్మాత ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పట్లో మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఇక జనగణమన సినిమాలో పూజా హెగ్డే విజయ్ దేవరకొండకి జోడీగా నటించింది.
ఆ మూవీ క్యాన్సిల్ కావడంతో పూజా పాపకి ఇప్పుడు విజయ్ తనతో రొమాన్స్ చేయడానికి మరో అవకాశం ఇచ్చాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాలో పూజ హెగ్డేని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ రిఫర్ చేయడంతో దర్శకుడు కూడా ఒకే చెప్పాడని సమాచారం. పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాతలు కూడా పచ్చజెండా ఊపారని తెలుస్తుంది. ఇక ఈ మూవీ అధికారికంగా త్వరలో కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.