Pooja Hegde: బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు టాప్ మోస్ట్ ప్రాజెక్టుల అవకాశాలు బుట్ట బొమ్మ పూజ హెగ్డే అందుకుంటూ ఉంది. ఇటీవలే సైమా అవార్డులు కూడా గెలవడం జరిగింది.
బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్రాజెక్టుల అందుకుంటున్న పూజా హెగ్డే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా సెగలు రేపుతూ ఉంది. తాజాగా రెడ్ డ్రస్సులో కసి చూపులతో పూజా హెగ్డే రెచ్చగొడుతూ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే అందాలకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు. “ఫరెవర్ న్యూ ఇండియా” బ్యాండ్ అంబాసిడర్ గా పూజా హెగ్డే ఈ ఫోటోలతో ఫోజులిచ్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న “SSMB 28” ఇంకా హరీష్ పవన్ ప్రాజెక్ట్.. “భగత్ సింగ్ భవదీయుడు”లో కూడా చేస్తూ ఉంది.
దసరా తర్వాత త్రివిక్రమ్…మహేష్ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో పూజ హెగ్డే ఎంట్రీ ఇవ్వనుంది. ఒకపక్క దక్షిణాది సినిమాలతో పాటు మరోపక్క బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ కెరియర్ పరంగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.