Pooja Hegde: తెలుగుతో పాటు పలు భాషల్లో క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటున్న హీరోయిన్ గా పూజా హెగ్డే చాలా బిజీగా ఉంది. తెలుగులో ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఫేమ్ సంపాదించిన పూజా హెగ్డే ఆ తర్వాత ఆమె కెరీర్ స్పీడ్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలతో పాటు తమిళం, బాలీవుడ్ లో కూడా భారీ ప్రాజెక్టులు చేస్తోంది.
తాజాగా హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. సదరు ఫోటోల్లో పూజా హెగ్డే వాకర్ సహాయంతో వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించింది. కాలికి పెద్ద పట్టీతో బుట్ట బొమ్మ నడవలేని స్థితిలో ఉంది. ఇది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన తార పరిస్థితి ఇలా తయారైందేంటి అని బాధపడుతున్నారు.
ఇంతకీ పూజా హెగ్డేకు ఏమైందనే ఆందోళనలో అందరిలో ఉంది. పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి చేస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు గాయమైంది. దీంతో ఆమె ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. ఇంట్లోనే నర్స్ సాయంతో వాకర్ తో వాకింగ్ ప్రాక్టీస్ చేస్తోంది.
Pooja Hegde:
తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పూజా హెగ్డే.. ‘నేను నా జీవితంలో రెండోసారి నడక నేర్చుకుంటున్నాను. దీన్ని తలుచుకుంటే చాలా ఫన్నీగా ఉంది’ అంటూ వివరించింది. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తుండగా.. ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ తో ‘సర్కస్’ సినిమా చేస్తోంది.