విజయ్ దేవరకొండ ఖుషీ షూటింగ్ అనంతరం ఈ సినిమా షూట్ మొదలెడతారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో పూజ పాత్ర హైలెట్ గా ఉంటుందని అందుకనే వెంటనే వేరే మాట ఆలోచించకుండా సైన్ చేసేసిందని తెలుస్తోంది.పూజ హెగ్డేకి వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ, ఆమెకి ఉన్న క్రేజ్ గానీ .. మార్కెట్ గాని కొంచెం కూడా తగ్గలేదు.
ఆమెకు వరస ఆఫర్స్ అయితే వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయి ఫ్లాపులు పడినప్పటికీ, ఆమె కొంచెం కూడా వెనకడగు వేసే పరిస్దితి లేదు. వచ్చిన అవకాశాల్లో తనకి నచ్చినవాటికి సైన్ చేస్తూ ముందుకు వెళుతోంది . తాజాగా ‘బుట్టబొమ్మ’ పూజ హెగ్డే విజయ్‌తో జతకట్టనుందని సమాచారం.

విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే :
ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోపరుశరామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందే సినిమా సైన్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం ఆగస్ట్ నుంచి పట్టాలు ఎక్కనుంది.
విజయ్ దేవరకొండ ఖుషీ షూటింగ్ అనంతరం ఈ సినిమా షూట్ మొదలెడతారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో పూజ పాత్ర హైలెట్ గా ఉంటుందని అందుకనే వెంటనే వేరే మాట ఆలోచించకుండా సైన్ చేసేసిందని తెలుస్తోంది. అసలు వీళ్లిద్దరు పూరి డైరక్షన్ లో మొదలై ఆగిన జనగణమన చిత్రంలోనే చేయాల్సి ఉంది.