Pooja Hegde : గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో అత్యంత స్టైలిస్ట్ కథానాయికగా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్దె. డెయిలీ వేర్ జిమ్ అవుట్‌ఫిట్స్, సమ్మర్ డ్రెస్సెస్, రెడ్ కార్పెట్ కోసం రెడీ గౌన్‌లను ధరించడంతో పాటు ఎత్నిక్ లుక్స్ లో అదరగొడుతుంది పూజా హెగ్దె. తాజాగా పూజా
హెగ్దె స్టైలిష్ వెస్ట్రన్ లుక్‌లో కనిపించి రచ్చ రచ్చ చేసింది. తన లేటెస్ట్ మూవీ సర్కర్ ప్రమోషన్స్ కోసం పూజా క్రాప్ టాప్, కార్గో ప్యాంట్స్ ను ధరించి సందడి చేసింది.

సర్కస్ మూవీ ప్రమోషన్స్ కోసం బెల్ స్లీవ్స్ కార్సెట్ నెక్‌లైన్ తో వచ్చిన ఐవరీ టాప్‌ను వేసుకుంది పూజా హెగ్దె. ఈ టాప్ కు జోడీగా ప్లేర్డ్ బాటమ్ వచ్చిన బ్లూ కలర్ కార్గో ప్యాంట్స్‌ను వేసుకుంది. చెవులకు ఎలాంటి అలంకరణ చేసుకోలేదు పూజా కానీ మెడలో మాత్రం డైమండ్ చోకర్ ను వేసుకుని అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కు సెట్ అయ్యేలా సిల్వర్ కలర్ స్ట్రీపీ హీల్స్‌ను వేసుకుంది. ఈ అవుట్‌లో తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ యూత్ ని ఖుషీ చేసింది పూజా హెగ్దె.

Pooja Hegde : పూజా ధరించి ఎత్నిక్ వేర్స్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూజా చీరకట్టులో ఎప్పుడు కనిపించినా తన అభిమానుల హృదయాలను ఎప్పుడూ గెలుచుకుంటూనే ఉంటుంది. ఈ మధ్యనే బంగారు వర్ణంలో ఉన్న లెనిన్ చీరను కట్టుకుని దేవకన్యలా మెరిసిపోయింది పూజా హెగ్దె. ఈ చీరకట్టుతో వెడ్డింగ్ ఫ్యాషన్ స్టైల్స్‌ను ప్రమోట్ చేస్తోంది ఈ చిన్నది. ఓంబ్రే టోన్డ్ ఫ్యాబ్రిక్ తో లైటర్ మెటాలిక్ గోల్డ్, డార్క్ గోల్డ్ షేడ్స్ తో డిజైన్ చేసిన ఈ చీర పూజా కలర్ టోన్
కు బాగా సెట్ అయ్యింది. ఈ ఆరడుగుల చీర అత్యద్భుతంగా కనిపించేందుకు లెనిన్, జరీ ఫ్యాబ్రిక్ ను మిక్స్ చేశారు డిజైనర్లు. ఈ చీరకు తగ్గట్లుగా రౌండ్నెక్‌లైన్ కలిగిన లెనిన్ బ్లౌజ్ వేసుకుంది. మెడలో విలువైన రాళ్లతో పొదిగిన బంగారపు నెక్‌లెస్ పెట్టుకుని చేతులకు బంగారు గాజులు, స్టేట్‌మెంట్స్ రింగ్స్‌ను ధరించి కుర్రాళ్లను ఫిదా చేసింది.

ఈ మధ్యనే జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ బుట్టబొమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్ వేసుకుని కుర్రాళ్లను కన్‌ఫ్యూజ్ చేసింది. బేబీ పింక్ కలర్ లో డిజైన్ చేసిన ఫ్రిల్డ్ గౌన్ వేసుకుని తన అందాలతో కవ్వించింది. ఈ అందమైన గౌనులో క్లీవేజ్ షో చూస్తూ చేసిస ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లోపోస్ట్ చేసింది పూజా హెగ్దె. ఈ పిక్స్ పోస్ట్ చేసిన క్షణాల్లోనే లైకులు, షేర్ల వర్షం కురిసింది.

ప్రస్తుతం పూజా చేతుల్లో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి సర్కస్. రోహిత్ షెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌వీర్ సరసన పూజా నటిస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో కనిపించబోతోంది. త్వరలో సల్మాన్ ఖాన్‌తోనూ ఓ ప్రాజెక్ట్ లో నటించబోతోంది పూజా హెగ్దె. ఈ సినిమా ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
