Pooja Hegde : ఆగస్టు మొదలు భారతదేశంలో పండుగల వైభవంగా ప్రారంభమైంది. వినాయక చవితితో దేశంలో అధికారిక ఉత్సవాల సీజన్ ప్రారంభమైంది. నవరాత్రి, దుర్గాపూజ , దీపావళి ఇలా వరుస పండుగలతో ప్రజలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక ఫ్యాషన్ పరిశ్రమ మొత్తం ఈ ఉత్సాహభరితమైన పండుగల కోసం అత్యద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను అందించడంలో బిజీ అయిపోయింది. ఈ పండుగల వేళ బాలీవుడ్ తారలు ఒకరిని మించి మరొకరు ఫెస్టివ్ ఫ్యాషన్‌తో సందడి చేశారు. ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్దే కూడా తనదైన స్టైల్స్‌ను ఈ ఫెస్టివ్ సీజన్ లో పరిచయం చేసింది. తాజాగా నిమ్మపండు లెహెంగా సెట్ వేసుకుని కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది.

Pooja Hegde : ఓ ఫోటో షూట్ కోసం పూజా హెగ్దే లైమ్ గ్రీన్ కలర్ లెహెంగా సెట్ ధరించి అదరగొట్టింది. తన ఫ్యాన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. షీర్ లేస్ డీటైల్స్ తో అద్భుతమైన ఫ్లేర్స్‌తో వచ్చిన ఫ్లేర్డ్ లెహెంగా స్కర్ట్ ను ధరించింది. ఈ స్కర్ట్‌కు జోడీగా ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన స్ట్రాపీ స్పగెట్టీ బ్లౌజ్‌ను ఎన్నుకుంది. ఆ అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా స్టేట్మెంట్ డ్యాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ చెవులకు అలంకరించుకుంది. తన కురులను లూజ్‌గా వదిలి మినిమల్ మేకప్‌తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.

పూజా హెగ్దే ఈ అవుట్‌ఫిట్‌తో దిగిన పిక్స్‌ను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీపాల వెలుగులో చాలా కూల్ గా ఫోటోలు దిగినా.. పూజా అందాలు కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి.

డీప్ నెక్‌తో వచ్చిన బ్లౌజ్ లో పూజా తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ లుక్స్ లో పూజాను చూస్తూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పూజా అందాలకు ఫిదా అవుతున్నారు.

రీసెంట్‌గా పూజా అద్భుతమైన పసుపు రంగు షరారా సెట్ వేసుకుని ఫెస్టివ్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్న ఈ అవుట్‌ఫిట్ పిక్స్‌ను పూజా హెగ్దే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌కు కూడా ఫాలోవర్స్ క్రేజీ కామెంట్స్‌ను పోస్ట్ చేశారు.

క్లాతింగ్ బ్రాండ్ అర్చనా జాజు షెల్ఫ్ నుంచి పూజా ఈ షరారాను ఎన్నుకుంది. సబ్టిల్ డీటైల్స్‌తో అందమైన ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ ఎల్లో అవుట్‌ఫిట్‌లో ఎంతో సాంప్రదాయంగా కనిపించింది పూజా. ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన పొట్టి కుర్తాకు జోడీగా ఫ్లేర్డ్ షరారా ప్యాంట్ వేసుకుని , వీటికి మ్యాచింగ్‌గా షిఫాన్ దుపట్టాను వేసుకుని ఎత్నిక్ లుక్స్‌లో మెరిసిపోయింది ఈ బుట్టబొమ్మ. మినిమల్ మేకప్‌తో చెవులకు జుంకాలు తగిలించుకుని అదరగొట్టింది.
