సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మీద రూమర్స్ రావడం సర్వసాధారణం. హీరోయిన్స్ పెళ్లి కానీ హీరోతో చనువుగా ఉంటే వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ప్రచారం చేస్తారు. ఇక సోషల్ మీడియాలో కొంత కాలం కనిపించకుండా దూరంగా ఉంటే ఏదో జరిగిపోతుంది అంటూ ఊదరగొడతారు. అయితే సెలబ్రెటీ లైఫ్ స్టైల్ పై పబ్లిక్ చాలా ఇంటరెస్ట్ చూపిస్తారు. ఈ కారణంగానే కొన్ని రూమర్స్ ని కావాలని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అయితే అన్ని రూమర్స్ కరెక్ట్ కాదు. అలా అని కొన్ని నిజం కాకుండా పోవు. పాత సామెత ప్రకారం చెప్పుకుంటే నిప్పులేనిదే పొగరాదు అనే సామెత ఈ రూమర్స్ విషయంలో వర్తిస్తుంది. ఇప్పుడు పూజా హెగ్డే మీద కూడా అలాంటి రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది.
ఈ బ్యూటీ అమెరికా వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్ చేయించుకుంది. ముఖ్యంగా శరీరంలో ప్రధానమైన పార్ట్స్ మరింత అందంగా కనిపించడం కోసం పూజా ఇలా చేసిందనే టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే స్టార్ ఇమేజ్ ని ఈ బ్యూటీ ఆశ్వాదిస్తుంది. పాన్ ఇండియా హీరోయిన్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంది. మరో వైపు హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి జోడిగా నటిస్తుంది. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ సినిమాలో ఆడిపాడింది.
ఇలా సినిమాల పరంగా ప్రస్తుతం పూజా హెగ్డే బిజీగా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అయినా కూడా రూమర్స్ స్ప్రెడ్ కావడంపై ఆమె విస్మయం వ్యక్తం చేసిందని, ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసినట్లు తెలుస్తుంది. కావాలని ఈ రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారనే మాటని తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.