సౌత్ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. అయితే ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా చాలా కారణాల వలన ఆలస్యం అవుతుంది. మరో వైపు సల్మాన్ ఖాన్ తో హిందీలో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పూజా హెగ్డే ఓ చిన్న ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కాలికి గాయం అయ్యింది. దీంతో నెల రోజుల నుంచి బెడ్ కె పరిమితం అయ్యింది. రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేస్తున్న కూడా ఇంకా పూర్తి స్థాయిలో మెరుగు పడలేదు.
మహేష్ బాబు సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి పూజా హెగ్డే కూడా ఒక కారణంగా తెలుస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలని షేర్ చేసింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ తొలి అడుగులు వేస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. ఇందులో ఆమె సపోర్ట్ తీసుకొని మెల్లగా అడుగులువేస్తుంది. ఇక ఆమె కాళ్ళకి బ్యాండేజ్ ఉంది. దీనిని బట్టి ఆమె కాలికి అయినా దెబ్బ తగ్గలేదని తెలుస్తుంది.
ఇక ఈ దెబ్బపూర్తిగా తగ్గి మళ్లీ తిరిగి షూటింగ్ కి రెడీ కావడానికి మరికొంత సమయం పట్టే సమయం ఉందని అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే ఇంటి దగ్గర పూజా హెగ్డే ఉండటంతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి తనకి సంబందించిన ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకుంటుంది. ఆ మధ్య తన హోమ్ టూర్ కూడా చేసింది. ఇలా ఇంటరెస్టింగ్ విషయాలు అన్ని కూడా పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉండటం వలన ఆమె న్యూస్ వైరల్ అవుతుంది.