సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ అవైటైడ్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇటు సౌత్ లో అటు బాలీవుడ్ లో కూడా పూజహెగ్డే ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న వారిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నబ్యూటీగా కూడా ఈ అమ్మడు తన హవాని కొనసాగిస్తుంది.
మంగళూరు బ్యూటీ అయిన పూజహెగ్డే ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత కొంత కాలం తెలుగుకి దూరం బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యింది. అయితే దువ్వాడ జగన్నాధమ్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సక్సెస్ బ్రేక్ అందుకుంది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతుంది. చివరిగా ఆమె నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
సినిమాలో పూజా అందానికి అందరూ ఫిదా అయిన కూడా సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో మూవీ కోసం ఆమె పని చేస్తుంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్లివేజ్ షోతో ఆమె తీసుకున్న ఫోటో షూట్ చూపు తిప్పుకోకుండా చేసేస్తుంది. ఆ ఫోటోలో పరువాల విందు ఆరగించమని చూపిస్తున్నట్లు ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.