Ponniyin selvan: మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్.. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఏకంగా బాహుబలి సినిమాతో పోల్చారు.
మణిరత్నం దర్శకత్వంలో తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రాజమౌళి బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున కోలీవుడ్ మీడియా ఈ సినిమా గురించి ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై టాలీవుడ్ ప్రేక్షకులు బాహుబలి సినిమా రికార్డులు బ్రేక్ చేయడం అంత సులభం కాదు అంటూ బాహుబలి సినిమా రికార్డులపై ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా బాహుబలి సినిమాకి పోటీగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా కనీసం బాహుబలిని కాదు కదా బింబిసార సినిమా స్థాయిలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది అంటూ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని బాహుబలి సినిమాతో పోలుస్తూ మణిరత్నం సినిమా పరువు మొత్తం తీశారు అంటూ పలువురు భావిస్తున్నారు.
Ponniyin selvan: ఆకట్టుకోలేకపోయిన పొన్నియిన్ సెల్వన్..
పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు.ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మణిరత్నం సిద్ధమయ్యారు. ఒక భాగం ప్రేక్షకుల ముందుకు రాగా రెండవ భాగాన్ని మరో ఆరు నెలల వ్యవధిలో విడుదల చేయనున్నట్లు మణిరత్నం ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. అయితే మొదటి భాగమే ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.