Ponniyin Selvan: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ పొన్నియన్ సెల్వన్ ‘ . చాలా కాలం తర్వాత మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది. తాజాగా విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి మంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ పై మణిరత్నం, సుభాస్కరన్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో కార్తీ, చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి వంటి ప్రముఖ నటి నటులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన నటి నటుల పారితోషికం వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ponniyin Selvan: భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న నటీనటులు
ఈ సినిమాలో నటించినందుకు విక్రమ్ రూ. 12 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఐశ్వర్యారాయ్ దాదాపు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించినందుకు త్రిష కూడా రూ. 5 కోట్లు అందుకుంది. మరొక తమిళ్ హీరో కార్తీ కూడా రూ. 5 కోట్లు అండుకోగా… జయం రవి రూ. 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.