ponniyan Selvan : భారతీయ దర్శక సినీ దిగ్గజం మణిరత్నం కు సినీ ఇండస్ట్రీ లో ప్రత్యేక స్థానం ఉంది. మౌనరాగం సినిమాతో తన టాలెంట్ ఏమిటో చూపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు . యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఈయన సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి . ఎందుకంటే అయన ఎలాంటి సినిమా తీసినా ఓ సందేశం ఉంటుంది. ఎలాంటి వారినైనా హత్తుకుంటుంది. కథలో రాజీ పడరు, స్క్రీన్ ప్లే లో తేడాలుంటే అస్సలు ఒప్పుకోరు. అలాంటి ఖచ్చితత్వం తోనే ఎన్నో అద్భుతమైన దృశ్య కావ్యాలు తెలుగు తెరకు పరిచయం చేసారు. ఈయన సినిమాలో ఒక్కసారైనా నటించాలని ప్రతి నటుడు తపిస్తాడు. అంతటి క్రేజ్ ఈ డైరెక్టర్ సొంతం. ఇద్దరు, రోజానాయకుడు, దళపతి, గీతాంజలి ఇలా ఎన్నో అద్భుతమైన , సందేశాత్మక సినీమాలను అందించిన మహనీయుడు . అయితే 2010 లో విడుదలైన రావణ్ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు ఈ దర్శక ధీరుడు. మళ్లీ 12 గ్యాప్ తర్వాత పొన్నియన్ సెల్వన్ చిత్రం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

ponniyan Selvan : పొన్నియన్ సెల్వన్ చిత్రం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు. ఫేమస్ హిస్టారికల్ నవల ఆధారం గా భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ , త్రిషా, శోభితా ధూళిపాళ్ల తదితరులు ఈ చిత్రం లో నటిస్తున్నారు . అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ స్థాయిలో తీసుకురావాలని మణిరత్నం ప్రయత్నించినా కలిసి రాలేదు. ఎట్టకేలకు సెప్టెంబర్ ౩౦ న విడుదలకు సిద్ధం అయ్యింది.

రూ . 500 కోట్ల బడ్జెట్ తో పొన్నియన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలను ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ హిట్ కొడితే రెండో భాగం నుంచి బిజినెస్ బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటి టి హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ సంప్రదించగా అన్ని భాషలకు కలుపుకుని రూ. 125 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది మూవీ యూనిట్. నిజానికి పొన్నియన్ సెల్వన్ చిత్రానికి ఇక్కడ పెద్దగా హైప్ కనిపించడం లేదు. పెద్దగా ప్రమోషన్ లు కూడా లేవు. తమిళం లో మినహా మరే భాషల్లోనూ సినిమా పై టాక్స్ లేవు. దీనితో సినిమా ఓపెనింగ్ ఎలా ఉంటుందనే టాపిక్ ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. 12 ఏళ్ల తర్వాత డ్రీమ్ ప్రాజెక్టు తో వెళ్తున్న మణిరత్నం ఎలాంటి మ్యాజిక్ చేస్తారో తెరమీదే చూడాలి