మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో మల్టీ స్టారర్ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక నవల ఆధారంగా చోళుల కథతో ఈ మూవీ హిస్టోరికాల్ జోనర్ లో తెరకెక్కింది. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ గా తమిళ ప్రజలు చారిత్రిక కథగా తెరపైకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజు ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. పూర్తిగా తమిళ నేటివిటీతో, పాత్రల పేర్లు, అలాగే కథనంలో కూడా ఎక్కువ డ్రామా ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకులకి సినిమా అంతగా కనెక్ట్ కాలేదు. హిస్టరీ తెలిసిన వారు, అలాగే హిస్టారికల్ డ్రామాలు చూడటానికి ఆసక్తి చూపించేవారికి ఈ కథ బాగా నచ్చింది.
ఇక తమిళనాట అయితే ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్లకి పైగా తమిళ్ బాషలో ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే భారీ సినీ ప్రముఖులు సైతం పొన్నియన్ సెల్వన్ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని బాషలలో కలిపి ఈ మూవీ ఇప్పటి వరకు 300 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక తమిళనాట ఇప్పట్లో పెద్ద చిత్రాలు ఏవీ లేకపోవడంతో ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ చూడటానికి థియేటర్స్ కి వెళ్తున్నారు.
ఇక లాంగ్ రన్ లో 500 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంటుంది అనే మాట వినిపిస్తుంది. వీకెండ్స్, అలాగే దసరా సెలవులు ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి. కుటుంబాలతో కలిపి సినిమా చూడాలని అనుకునేవారు పొన్నియన్ సెల్వన్ మూవీకి వెళ్తునన్నారు. అయితే ఈ సినిమా కథని మణిరత్నం వక్రీకరించారని, చోళులకి కాషాయరంగు పులిమే ప్రయత్నం మణిరత్నం చేస్తున్నారనే విమర్శలు తమిళనాట ఒక వర్గం నుంచి వినిపిస్తుంది. తమిళనాడులో యాంటీ హిందూ సంస్థలు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆదిత్య చోళుడు బుద్ధిజానికి చెందిన వాడని వాదిస్తున్నారు.