మణిరత్నం దర్శకత్వంలో తమిళ్ లో మొట్టమొదటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా పొన్నియన్ సెల్వన్ 1 మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఈ మూవీ చోళుల కథాంశంతో నవల ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ మూవీలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ క్యాస్టింగ్ నటించారు. ఇలా మల్టీ స్టారర్ గా సినిమా ఆవిష్కరించడంతో పాటు బాహుబలి తర్వాత ఆ రేంజ్ చిత్రంగా మూవీ ఉండబోతుంది అనే టాక్ నడిచింది. అయితే బాహుబలి సిరీస్ తో ఈ మూవీని పోల్చి చూసినా కూడా దానికి దీనికి చాలా తేడా ఉందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. దీనికి సౌత్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమా ప్రమోషన్ కూడా అదే స్థాయిలో చేశారు. తాజాగా రిలీజ్ అయినా ఈ సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళ్తే
10వ శతాబ్దంలోని చోళుల సామ్రాజ్యంలో జరిగిన కథాంశంగా ఆవిష్కరించారు. ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు, కుట్రలు, ప్రత్యర్థులపై పోరాటాలని అద్భుతంగా ఆవిష్కరించారు. ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నందిని అనే పాత్రలో చోళ సామ్రాజ్యంలో కుట్రలకి తెరతీసే పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించింది. ఈ సినిమా చూసిన పబ్లిక్ టాక్ బట్టి ఇందులో నటీనటులు ఎవరికి వారు తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. అలాగే మణిరత్నం మేకింగ్ విజన్ అడుగడుగునా కనిపిస్తుంది. పూర్తిగా యాక్షన్ ఘట్టాలతో కాకుండా ఒక రాజ్యంలో రాచరికం, పరిపాలన, రాజకీయం, వ్యూహాలు, కుట్రలు ఏ విధంగా ఉంటాయనే విషయాలని డ్రమాటిక్ గా ప్రెజెంట్ చేశారు. కథనం పరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశం కళాతకంగా, హృదయాల్ని తాగే విధంగా తీర్చి దిద్దారు. ఇక మణిరత్నం విజన్ కి ఏఆర్రెహమాన్ సంగీతం మరో లెవల్ లో ఉందని చెప్పాలి.
అలాగే రవివర్మ సినిమాటోగ్రఫీ కూడా పొన్నియన్ సెల్వన్ మూవీని దృశ్యకావ్యంగా ప్రేక్షకులకి మంచి అనుభూతి అందించింది అనే మాట వినిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించినా కూడా ఓవరాల్ గా పొన్నియన్ సెల్వన్ చిత్రం కచ్చితంగా హిస్టారికల్ క్లాసిక్ మూవీగా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా ఉందనే టాక్ ట్విట్టర్ లో నడుస్తుంది. ఇందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి నేషనల్ అవార్డు రావడం పక్కా అనే మాట వినిపిస్తుంది. చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలన్ పాత్రలో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక నందినిగా పవర్ విలన్ గా ఐశ్వర్యారాయ్ చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన అందంతో పాటు అభినయంతో మాయ చేసింది.
ఆమె పాత్రని చూసిన ప్రతి ఒక్కరికి ఐశ్వర్యారాయ్ అందం కంటే ఆమె క్రూరత్వమే కనిపిస్తుంది. కార్తీ చేసిన పాత్ర ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే పవర్ ఫుల్ గా సాగిందనే మాట వినిపిస్తుంది. ఇలా అన్ని పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉండటంతో పాటు ఇందులో నటించిన స్టార్ హీరోలు అందరికి కరెక్ట్ స్క్రీన్ షేరింగ్ లభించింది అనే టాక్ నడుస్తుంది. దీనిని యాక్షన్ చిత్రంగా కంటే హిస్టోరియల్ డ్రామాగానే మణిరత్నం రిప్రజెంట్ చేసి అందరికి మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ ని అందించారు. ఓవరాల్ గా సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే సినిమా పాత్రల పేర్లతో పటు కథాంశం కూడా తమిళ్ నేటివిటీతో ఎక్కువగా ఉండటంతో తెలుగుతో పాటు హిందీ ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.