Polavaram: ఏపీలో రాజకీయం వేడెక్కింది. విశాఖలో గత కొద్దిరోజుల క్రితం చోటుచేసుకున్న పరిణామాలు నేతల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తున్నాయి. వైసీపీ విశాఖలో అధికారికంగా గర్జన చేయాలని అనుకోగా.. అదే విశాఖలో ప్రజావాణి కోసం అంటూ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది. విశాఖకు భారీగా వైసీపీ, జనసేన కార్యకర్తలు చేరుకోగా.. కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మొత్తానికి విశాఖ నుండి బయటకు వచ్చిన జనసేన అధినేత.. ప్రెస్ మీట్ లో చాలా ఘాటుగా మాట్లాడారు. తనను ప్యాకేజీ స్టార్ అన్న కొడుకులు అందరినీ చెప్పుతో కొడతా అంటూ తన కాలి చెప్పును చూపించారు. వైసీపీలో ఉన్న కాపు సన్నాసులకు ఈడ్చి కొడతాను అంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే వాళ్లకేంటంటూ ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 మందితో తిరుగుతున్న వాళ్లకు నష్టమేంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ మాటల మీద ఏపీ మంత్రులతో పాటు పరోక్షంగా సీఎం జగన్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక జనసేన.. తన ట్విట్టర్ లో ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాల మీద ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందులో భాగంగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటూ మంత్రి అంబటిని ప్రశ్నిస్తూ.. జనసేన ట్వీట్ చేసింది.
Polavaram:
దీనికి బదులుగా అంబటి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది.. కనీసం అరగంట అయినా ప్రెస్ ముందుకు వచ్చి అంబటి చెప్పగలరా?’ అంటూ జనసేన ఒక ఫోటోను పోస్ట్ చేయగా.. దానిని తన ట్విట్టర్ లో రీషేర్ చేస్తూ.. ‘పవన్ నాలుగో పెళ్లి అయ్యేలోపు పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది’అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి పవన్ విషయంలో అందివచ్చిన ప్రతి అంశాన్ని వైసీపీ నేతలు, మంత్రులు వాడుకుంటూ.. రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు.
పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాది ! pic.twitter.com/YxGK52BIbg
— Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2022