మన ఇండియాలో క్రికెట్ కున్న ఆదరణ మరే ఇతర స్పోర్ట్స్ కు లేదు.అందుకే మన దేశంలో క్రికెట్ టోర్నీలు జరుగుతున్నప్పుడు కొత్త సినిమా రిలీజ్ లను వాయిదా వేసుకుంటూ ఉంటారు.మరి అంత క్రేజ్ ఉన్న క్రికెట్ కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశాన్ని ఇప్పుడు తెలుసుకందాం.
క్రికెట్ స్టేడియంలో మనకి ఒకటి కంటే ఎక్కువ పిచ్ లు కనిపిస్తుంటాయి.వీటిని చూసినవారంతా వాటన్నిటి మీద ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతారని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు.ఒక పిచ్ రికవర్ అయ్యి మామూలు కండిషన్ కి రావడానికి చాలా సమయం పడుతుంది.అందుకే నెట్ ప్రాక్టీస్ కు ఒక పిచ్ ను, డోమస్టిక్ మ్యాచ్ లకు ఒక పిచ్ ను ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు ఒక పిచ్ ను తయారు చేస్తారు.ఇలా మూడు రకాల అవసరాల కోసం పిచ్ లను వేరు వేరుగా తయారు చేస్తారు.వీటిలో ఒక్కొక్క పిచ్ ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తుంది.