Biggboss 6 : బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి చేస్తోంది. షో మొదలై రెండే రోజులవుతున్నా.. కంటెస్టెంట్లు చేసే రచ్చతో ఈ షో త్వరలోనే జనాల్లోకి వెళ్లి పోయింది. తొలి రోజు నుంచే గొడవలు, అలకలు, ఏడుపులతో బిగ్‌బాస్ హౌస్ నడుస్తోంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. ఆదివారం సీజన్ 6 అట్టహాసంగా ప్రారంభమైంది. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్టలో కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డిలు ఉన్నారు.
ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే.. కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్స్. సీజన్ ప్రారంభానికి ముందే హోస్ట్ రెమ్యూనరేషన్ విషయమై ఓ క్లారిటీ వచ్చేసింది. అది నిజమో కాదో కానీ ఆ క్లారిటీతో హోస్ట్ రెమ్యూనరేషన్‌పై చర్చ మాత్రం ముగిసింది. ఇక కంటెస్టెంట్స్‌లో అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరదనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునేది ఎవరంటే.. ఇండియన్ ఐడల్ విజేత, సింగర్ రేవంత్. ఈ యంగ్ సింగర్ అందరి కంటే ఎక్కువగా రూ. 60 వేలు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇది రోజుకా లేదంటే వారం రోజులకా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Biggboss 6 : గీతూ రాయల్ రెమ్యూనరేషన్ కంటే కూడా తక్కువ
ఇక హాట్ టాపిక్‌గా నడుస్తున్నది సుదీప అదేనండీ.. నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ రెమ్యూనరేషన్. అలాగే నటి అభినయశ్రీ రెమ్యూనరేషన్. వీరిద్దరి రెమ్యూనరేషన్ పెద్ద మొత్తంలో ఉంటే చర్చించుకోవల్సిన అవసరం లేదు కానీ నిన్న కాక మొన్న బుల్లితెరపైకి వచ్చిన గీతూ రాయల్ రెమ్యూనరేషన్ కంటే కూడా తక్కువ ఉండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పింకీతో పాటు అభినయశ్రీకి బిగ్‌బాస్ నిర్వాహకులు కేవలం రూ.20 వేలు మాత్రమే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారని టాక్. వీరిద్దరూ ఎప్పటి నుంచో ప్రేక్షకులకు సుపరిచితులు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. అలాంటి వారికి రెమ్యూనరేషన్ ఇంత తక్కువగా ఉండటం ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది. అయితే వీరిద్దరి రెమ్యూనరేషన్ కూడా రోజుకా లేదంటే వారానికా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.