మొదట్లో జనాలకి ఉచితాలు అలవాటు చేసి ఆ తరవాత వారిపై బాదడం వేయడం కార్పొరేట్ కంపెనీలకు అలవాటైపోయింది.తాజాగా ప్రముఖ సంస్థ ఫోన్ పే ఇదే బాటలో నడుస్తుంది.మొబైల్ రీచార్జ్‌లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది.మిగతా సంస్థలు కూడా ఇదే బాటలో నడించెందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఒక్క ఫోన్ పే తప్ప మిగతా సంస్థలన్నీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో 40 శాతం వాటా కలిగి ఉన్న ఫోన్‌పే రూ. 50 లేదా అంతకమించిన రీచార్జ్ లపైన రెండు రూపాయలు చార్జిలను వసూలు చేస్తుంది.అలాగే ఫోన్‌పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు 50 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది.
ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది ఫోన్‌పే కూడా… ఇన్నిరోజులు సేవలను ఉచితంగా అందిస్తూ రాగా.. ఇప్పుడు బాదుడు షురూ చేసింది.. మొబైల్ రీచార్జ్‌లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తోంది. రూ. 50, అంతకుమించిన రీచార్జ్ లపైన రూ.2 చొప్పున ఛార్జ్ చేస్తోంది.