పెట్రోల్,డీజిల్ ధరలు నియంత్రణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయి. వీటి ధరల పెరుగుదలపై ప్రజలు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వాలు మాత్రం ఇవి పట్టించుకోకుండా పెట్రోల్,డీజిల్ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.ఈ నెలలో ఇప్పటివరకు 22 సార్లు పెట్రోల్ రేట్లను పెంచిన ప్రభుత్వం మరోసారి ప్రజల నెత్తిన భారం వేసింది.తాజాగా లీటర్ పెట్రోల్ పై 35 పైసులు,లీటర్ డీజిల్ పై 37 పైసలు పెంచింది.
దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 113.74 కు చేరగా,డీజిల్ ధర 106.99 కు చేరింది.ఇక విజయవాడలో అయితే పెట్రోల్ ధర 115.65,డీజల్ 108.29 గా ఉన్నాయి.