శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్ళిసందడి సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీలకు తెలుగులో మంచి ఆదరణ లభించింది.ఈమెకు కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓ వైపు హీరోయిన్ గా పని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు ముంబైలో ఎంబీబీఎస్ చదువుతుంది.పెళ్ళిసందడి సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీలీల తాజాగా ఎంబీబీఎస్ పరీక్షలు దగ్గరపడుతుండటంతో ముంబై చేరుకొని చదువుకుంటుందని సమాచారం.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో నటిస్తుంది.అలాగే ఈమె గ్లామర్ కు ఫిదా అయిన కొంతమంది మీడియం రేంజ్ హీరోలు ఈమెను తమ చిత్రాలలో హీరోయిన్ గా ఫైనల్ చేసే పనులలో బిజీగా ఉన్నారు