ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేసుకోవడంతో పాటు బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ అమ్మడు పెర్ఫార్మెన్స్ కి సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఇక మొదటి సినిమా సక్సెస్ తర్వాత వెంటవెంటనే ఈ భామకి అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్, రవితేజ సరసన కూడా నటించింది. అయితే ఆమెకి అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు.
అయితే చిన్న, పెద్ద అని తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ పాయల్ రాజ్ పుత్ వచ్చింది. దీంతో ఈమె కెరియర్ కూడా ప్రమాదంలో పడింది. బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాలని ఏ మాత్రం సంకోచం లేకుండా చేసేసే పాయల్ రాజ్ పుత్ కి మాతృభాషలో మాత్రం బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో ఈజ్ చూపించలేకపోతుంది. రీసెంట్ గా ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో కూడా ఆమె పాత్ర కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి మరో అదిరిపోయే అవకాశం ఓటీటీలో వచ్చినట్లు తెలుస్తుంది.
అయితే ఇది కాస్తా అడల్ట్ కంటెంట్ తో ఉంటుందని, బోల్డ్ గా నటించడంతో పాటు న్యూడ్ కూడా కనిపించాల్సిన అవసరం ఉంటుందని చిత్ర దర్శకుడు చెప్పాడు . ఇక రెమ్యునరేషన్ గా ఏకంగా 50 లక్షలు ఆఫర్ చేసారని వినికిడి. దీంతో ఆ సన్నివేశం కేవలం నిమిషం మాత్రమే ఉంటుందని చెప్పడంతో పాయల్ ఏ మాత్రంసంకోచించకుండా ఒకే చెప్పేసినట్లు బోగట్టా. కంటెంట్ సక్సెస్ అయిన అవకున్నా ఏకంగా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాయల్ ఆ పాత్రకి ఒకే చెప్పినట్లు బోగట్టా.