టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా మాతృభాష పంజాబీలో కూడా సినిమాలు చేస్తుంది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావాలని ఈ బ్యూటీ కలలు కంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మంచు విష్ణుకి జోడీగా నటించిన జిన్నా మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. ఇక ఈ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి పాయల్ రాజ్ పుత్ మళ్ళీ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణం చేసింది.
ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో తనకి ఎదరైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. గత కొన్నేళ్లుగా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఇండిగో విమాన సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రయాణికులతో వారి ప్రవర్తన చాలా దురుసుగా ఉంటుందని, అలాగే సరైన సమాచారం ఇవ్వరని, సామాన్లు కూడా వారికి నచ్చినట్లు విసిరేస్తూ ఉంటారని ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ కూడా ఇండిగో సిబ్బంది తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. అలాగే అక్కడ ఇండిగో సిబ్బందితో తన గొడవకి సంబందించిన ఫోటోలని కూడా అందులో జోడించింది.
ఇండిగో సిబ్బంది తమ వస్తువుల భద్రతపై చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అవి డ్యామేజ్ అయ్యే విధంగా విసిరేస్తున్నారని విమర్శించారు. అలాగే ఇండిగో సిబ్బందిని ఈ విషయంపై ప్రశ్నించినపుడు వారి నుంచి నిర్లక్ష్యమైన సమాధానం వచ్చిందని పేర్కొంది. ఇక ఆ ట్విట్ ని నేరుగా ఇండిగో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండీల్ కి కూడా పాయల్ రాజ్ పుత్ జత చేయడం విశేషం. ఇక ఈ ఘటనపై పాయల్ ట్విట్టర్ పై ఇండిగో యాజమాన్యం కూడా స్పందించి సారీ చెప్పడంతో పాటు జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. ఇక తన ట్వీట్ పై స్పందించినందుకు పాయల్ రాజ్ పుత్ వారికి థాంక్స్ చెప్పింది.