పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వింటేజ్ లుక్‌లో పవర్ స్టార్ ఈ సినిమా లో అదరగొట్టాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం అవుతోంది. అయితే, ఓటీటీలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే అది ఇండియాలో కాదండోయ్. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలోనూ ‘బ్రో’ సినిమా రికార్డు సృష్టిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన దగ్గరి నుంచి ఈ సినిమా టాప్‌లో కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 21 నుంచి 27 వరకు నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఇండియాలో నం.1లో ఉండగా.. నాన్ ఇంగ్లిష్ సినిమాల లిస్ట్‌లో టాప్7లో నిలిచింది. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో టాప్8లో ఉంది. దీంతో పవన్‌కల్యాణ్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయింది.