ప్రస్తుతం కరోనా మూడో వేవ్ మన దేశంలో ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాము. దేశ వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి వేవ్ లో సౌత్ ఇండియన్ సినిమా దగ్గర అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో చాలా మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో మహేష్ బాబు, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూతో పాటు శోభన సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఈ కోవలోనే రేణు దేశాయ్‌తో పాటు ఆమె తనయుడు అకిరా నందన్ కోవిడ్ బారిన పడ్డట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. అయితే వారు గత కొన్ని రోజులు కితమే పాజిటివ్ కాగా ఇప్పుడు తాము కోలుకుంటున్నారు రేణు తెలిపారు.
మరి అంతే కాకుండా తాను ఆల్రెడీ రెండు డోసులు వాక్సిన్ చేయించుకున్నా మళ్ళీ పాజిటివ్ అయ్యానని తెలిపారు. ఇక తనయుడు అకిరా నందన్‌కు వ్యాక్సిన్ వేయించేలోపు.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ప్రజలందరూ.. జాగ్రత్తగా ఉండాలని రేణు దేశాయ్ కోరారు.
రేణు దేశాయ్ విషయానికొస్తే.. ఒక నటి కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు అకిరానందన్, ఆద్యాతో కలిసి పూణెలో ఉంటోంది. రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్‌తో నేరుగా కలవకపోయినా.. తన పిల్లలను పవన్ కళ్యాణ్‌కు మాత్రం దూరం చేయలేదు. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో వీళ్లు పవన్ కళ్యాణ్‌తో కలిసి సందడి చేస్తూనే ఉన్నారు.
ఆ మధ్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్.
మధ్యలో రేణు దేశాయ్.. ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ రేణు దేశాయ్.. వేటికి యస్ చెప్పలేదు. కానీ రేణు దేశాయ్.. తాను నటిగా ఓ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Also Read : ప్రముఖ నటి ఖుష్బూ కరోనా పాజిటివ్