Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలా ఈయన రాజకీయాలలో ఎంతో బిజీగా ఉంటూ ఇప్పటికే తన జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున తన పార్టీని ప్రచారం చేస్తూ పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా భావించిన పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ప్రజల బాధలను తెలుసుకుంటున్నారు.ఇలా ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి ఈయన మరోవైపు సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి ఉన్నఫలంగా అమెరికా వెళ్లారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నఫలంగా అమెరికా వెళ్లడానికి గల కారణం ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పూర్తిగా తన వ్యక్తిగత విషయం గురించి అమెరికా వెళ్లారని తెలుస్తుంది.అయితే మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ పనిమీద అక్కడ ఓ సమావేశంలో పాల్గొనడం కోసమే అమెరికా వెళ్లినట్టు సమాచారం.
Pawan Kalyan: పార్టీ కోసమే అమెరికా వెళ్లిన పవన్..
వచ్చే ఎన్నికలలో పార్టీ కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు కావాల్సిన పనురులను సమకూర్చుకోవడం కోసమే ఈయన అమెరికాలో ఓ మీటింగులో పాల్గొనడం కోసం వెళ్లారని వార్తలు వస్తున్నాయి.అయితే మరికొంతమంది మాత్రం గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యన ఉండటం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగలేదని హెల్త్ చెకప్స్ కోసమే పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్ళొస్తున్నారంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయన అమెరికా పర్యటన గురించి భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన ఎందుకు వెళ్లారనే విషయం మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఈయన అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం హరిహర వీరమల్లు సినిమా షూటింగు తో బిజీగా ఉన్నారు.