పవర్ స్టార్ పవన్ మూడు వివాహాల గురించి రాజకీయ వర్గాలలో నిత్యం విమర్శలు వస్తూ ఉంటాయి. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని ఇరుకున పెట్టేందుకు మూడు పెళ్లిళ్ల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ చాలా సార్లు ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల విషయంలో మరోసారి స్పందించారు. అయితే ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ మొదటిసారి మరింత లోతుగా మూడు పెళ్లిళ్ల విషయంలో తనదైన శైలిలో స్పష్టం చేశారు.
ఇక మూడు పెళ్లిళ్లు అని పదే పది వైసీపీ నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని అయితే చట్టబద్ధంగా తాను విడాకులు తీసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. మొదటి భార్యకి ఐదు కోట్లు ఇచ్చి విడాకులు ఇచ్చానని, ఇక రెండో భార్యకి అయితే తన ఆస్తి మొత్తం ఇచ్చేశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెండో భార్యతో ఇద్దరి బిడ్డలని కనడం వలన రేణు దేశాయ్ కి వారిద్దరి భవిష్యత్తు కోసం ఆస్తిని రాసిచ్చినట్లు పవన్ కళ్యాణ్ మాటల బట్టి తెలుస్తుంది.
అయితే గతంలో రేణు దేశాయ్ మాత్రం విడాకుల సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పింది. తనకి ప్రాపర్టీ రాసి ఇచ్చినట్లు జరిగిన ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ మీద ఆగ్రహంతో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలని బయట పెట్టారు. విడాకుల సమయంలో జరిగిన విషయాలని ఓపెన్ అయిపోయారు. దీనిపై రేణు దేశాయ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.