Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ ప్రస్తుతం మోహన్ రాజ దర్శకత్వంలో కొణిదెలా ప్రొడక్షన్ బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా చేయాలని చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని ఇలా మెగాస్టార్, పవర్ స్టార్ ను ఒకే వేదికపై చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం లేదనే వార్తలు వినపడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ఆహ్వానించొద్దంటూ చెప్పారని సమాచారం. అయితే మెగాస్టార్ ఈ కార్యక్రమానికి వద్దు అని చెప్పడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు.ఈయన దసరా పూర్తి అయ్యేవరకు అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చే సూచనలు కనబడటం లేదు.
Pawan Kalyan: రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా…
ఈ క్రమంలోనే అమెరికాలో ముఖ్యమైన పనిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ను డిస్టర్బ్ చేయడం మంచిది కాదని అందుకే తనని కార్యక్రమానికి ఆహ్వానించొద్దు అంటూ మెగాస్టార్ నిర్మాతలకు సూచించినట్టు తెలుస్తోంది.ఇక మెగాస్టార్ పిలిస్తే పవన్ రాకుండా ఉండరు. అయితే తన పనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేనటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఈవెంట్ కు పిలవద్దని సూచించారని తెలుస్తోంది.అయితే మరో వర్గం వారు పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరైతే ఈ వేడుక రాజకీయంగా మారుతుందని, అందుకే మెగాస్టార్ చిరంజీవి భయపడి పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.