Pawan Kalyan: తెలుగులో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరని అడిగితే.. సినిమాల గురించి ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తప్పక చెబుతాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తనదైన నటన, మేనరిజంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సాధించాడు. సినిమా హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా విపరీతమైన ఫాలోయింగ్ ను కలిగి ఉండటం పవన్ కు మాత్రమే సాధ్యమైంది.
ఓ పక్కన సినిమాలు చేస్తూ మరోపక్క జనసేన పేరుతో పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు కూడా చేస్తున్నాడు. ఏపీలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు సాగుతున్నాడు. కాగా రాజకీయాల వల్ల పవన్ కు బాగా సన్నిహితంగా ఉన్న కమెడియన్ అలీ దూరమైనట్లు వార్తలు రావడం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితుడిగా, పవన్ ప్రతి సినిమాలో కనిపించే అలీ.. గత రెండు సినిమాల నుండి కనిపించడం లేదు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాల్లో అలీ కనిపించకపోగా.. జనసేనలో అలీ చేరకుండా వైసీపీలో చేరడం వల్లే ఈ గ్యాప్ ఏర్పడిందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అలీ పవన్ పేరును ప్రస్తావించడంతో అందరిలో ఆసక్తి రేగింది.
Pawan Kalyan:
అలీ ఓ టీవీ ఛానల్ లో టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులను తన టాక్ షోకు పిలిపించి, ముచ్చటించే అలీ త్వరలోనే పవన్ కళ్యాణ్ ను తన షోకు తెస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్ని అలీనే స్వయంగా వెల్లడించడంతో.. పవన్ కళ్యాణ్ అలీ షోకి ఎప్పుడు వస్తారనే చర్చ సాగుతోంది. మొత్తానికి అలీ గనక పవన్ ను తన షోకి రప్పించగలిగితే.. వీరి మధ్యన వచ్చిన వార్తలు అన్నీ అబద్దాలే అని తేలిపోతుంది.