Pawan Kalyan: ఏపీలో రాజకీయా వేడి పుట్టిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తాజాగా కేసు నమోదైంది. ఇప్పటంలో జనసేన సభకు భూములిచ్చారని.. జనసేన,టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, కట్టడాలను కూల్చారని పవన్ ఆరోపించడం తెలిసిందే. వారికి సంఘీభావంగా మంగళగిరి నుండి ఇప్పటం గ్రామానికి వెళ్లి పరామర్శించడం, బాధితులకు భరోసానివ్వడం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా పవన్ మీద కేసు నమోదైంది.
మంగళగిరి నుండి ఇప్పటంకు భారీ వాహన శ్రేణితో నేషనల్ హైవే గుండా పవన్ కళ్యాణ్ వెళ్లగా.. ఇలా వెళ్లే క్రమంలో తనకు యాక్సిడెంట్ జరిగిందంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. FIR నెంబర్ 817/2022గా, IPC 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.
మంగళగిరి నుండి ఇప్పటం గ్రామానికి కారు టాప్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ ప్రయాణం చేయడం, కార్ ర్యాష్ డ్రైవింగ్ నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. నేషనల్ హైవీపై ఆయన వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించడంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి మారిస్ పేటకు చెందిన పి.శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Pawan Kalyan:
ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు అతడి డ్రైవర్ మీద కూడా కేసు నమోదయింది. ఇతరుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినందుకు ఐపీసీ 336 సెక్షన్ కింద.. అలాగే రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగా ఐపీసీ 279 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి ఇప్పటంలో కూల్చివేతలు, ఆ తర్వాత పరామర్శలు, ఇప్పుడు కేసుల వరకు వచ్చింది.