Pawan Kalyan: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి స్నేహితులు ఎవరంటే ఠక్కున చెప్పే పేర్లు కమెడియన్ అలీ (Comedian Ali) జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ ఇండస్ట్రీ కి వచ్చిన సమయం నుంచీ వీరి మధ్య స్నేహం కొనసాగుతుంది. మంచిగా సాగుతున్న వీరి స్నేహంలో రాజకీయం చేరడంతో ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చులు మొదలయ్యాయి. తన స్నేహితుడు పవన్ జనసేన అనే పార్టీ పెట్టినా కూడా అలీ జగన్ మోహన్ రెడ్డి వైసీపీకి జై కొట్టారు. అది మాత్రమే కాదు ఆ పార్టీ కి కూడా ప్రచారం చేశారు.
అలీ జనసేనాని పవన్ కళ్యాణ్ ని అంట మాట అన్నారా..?
అలీ వైసీపీ లో చేరడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు అలీ మీద విరుచుకుపడ్డారు. ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అలీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వైసీపీకి సపోర్ట్ చేయడం అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి వచ్చేలా చేసింది.
పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన మీద అలీ ప్రత్యక్షంగా మాట్లాడారని మీడియా సమాచారం. రోడ్ల విస్తరణను పవన్ కళ్యాణ్ తప్పుబట్టడం గురించి మాట్లాడిన అలీ జనసేనాని అలా అనడం తగదని ప్రజలకి ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించాలని అలీ అన్నట్టు చెప్తున్నారు. అలా చెప్పడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలు ప్రభుత్వానికి ప్రమాదం కాదు అని కూడా అన్నారు అని చెప్తున్నారు.
Pawan Kalyan:
జనసేన అధికారం లోకి రావడానికి తీవ్ర కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అలీ జగన్ బాగా అభివృద్ధి చేస్తున్నారని,ఆ అభివృద్దే ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తెస్తుంది అని అన్నారట. ఈ వ్యాఖ్యలు జనసేన అభిమానులకి రుచించడం లేదు. జగన్ కట్టబెట్టిన పదవే అలీ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం అని కొందరు అంటున్నారు.