Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు ఎక్కడా లేని ఎమోషన్ , వైబ్రేషన్ , అఫెక్షన్ వచ్చేస్తుంది యూత్ కి . ఈ స్టార్ హీరో కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. కెరీర్ ప్రారంభం నుంచే తనదైన మ్యానరిజంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకున్నారు పవన్. 20 ఏళ్ళ క్రితమే కమర్షియల్ లో నటించమని కంపెనీ లు పవన్ చుట్టూ తిరిగేవి . కానీ పవన్ సింపుల్ గా నో చెప్పేవాయారు. ఇప్పుడు బడా ప్రొడ్యూసర్ గా ఉన్న శరత్ మరార్ కమర్షియల్ యాడ్స్ చేస్తే క్రేజ్ , పాపులారిటీ పెరుగుతుందని చెప్పడం తో ఒకే అన్నారు. 20 ఏళ్ల క్రితం పెప్సీ యాడ్ లో నటించి సెన్సేషన్ ను సృష్టించారు పవన్ . అప్పటి ఆ యాడ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన వెంటనే లైకులు, షేర్ ల వర్షం కురుస్తోంది. ఇది చుసిన నెటిజెన్ లు ఇదేం పిచ్చ క్రేజ్ రా బాబు అని అంటున్నారు.

Pawan Kalyan : ఒక్కప్పుడు స్టార్ ఇమేజ్ ఉన్నా యాడ్స్ కు పెద్దగా ప్రయారిటీ ఇచ్చేవారు కాదు హీరోలు . బాలీవుడ్ స్టార్లు ఈ విషయం లో ముందు వరుసలో ఉండేవారు . అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మొదటి సారిగా థమ్స్ అప్ యాడ్ చేసి అందరిని ఫిదా చేశారు. ఆ తర్వాతా భారీ పారితోషకం ఇస్తామన్న ఎందుకో కమర్షియల్స్ కు కనెక్ట్ కాలేదు ఈ బాసు. పవన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వెంటనే క్రేజీ సినిమా ప్రాజెక్టులలో నటించి తన బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకున్నారు . పెప్సీ కంపెనీ రిక్వెస్ట్ మేరకు ఆ యాడ్ లో నటించారు. ఆ తర్వాత నేను తాగని డ్రింక్ ను నేను ప్రమోట్ చేయడం ఏంటని తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కమర్సిల్స్ లో కనిపించలేదు ఈ పవర్ స్టార్ . అయినా 20 ఇయర్స్ బ్యాక్ చేసిన యాడ్ ఇప్పుడు సోషల్ మీడియా ను ఓ ఊపు ఊపేస్తోంది. అప్పట్లో పవన్ లుక్ ని చూసి ఫాన్స్ మురిసిపోతున్నారు .వాట్ ఆ చేంజ్ అంటూ అవాక్కవుతున్నారు.

ఇప్పుడున్న హీరోలు కాస్త స్టార్డమ్ రాగానే కమర్సిల్స్ కి సైన్ చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. ఆ విషయం లో కమర్షియల్ మార్కెట్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ కు మంచి కాంపిటీషన్ ఉంది. పుష్ఫ మూవీ క్రేజ్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ పెరిగింది. దీనితో భారీ ఆఫర్స్ ఈ స్టైలిష్ స్టార్ తలుపు తడుతున్నాయి.