రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో మొదలైన రచ్చ ఆంధ్రప్రదేశ్ లో నిప్పుని రాజేస్తుంది.రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని ని కలిసిన దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్ లు తాజాగా పవన్ కళ్యాణ్ ను కలిశారు.దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
ఈ నిర్మాతలు పక్కన కూర్చొని ఉన్న సమయంలోనే మంత్రి పేర్ని నాని పవన్ పై నిప్పులు చెరిగారు.అప్పుడు మౌనం వహించిన నిర్మాతలు సడెన్ గా పవన్ ను కలవడంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అందరూ ఆలోచనలో పడ్డారు.ఈ సమావేశం వెనక ఆంతర్యాన్ని చేధించడానికి విశ్లేషకులు,మీడియా సంస్థలు వారు తమ తలలకి పదను పెడుతున్నారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న వైసిపి వెర్సెస్ పవన్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.