తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా కలిసి జంటగా నటించిన భీమ్లా నాయక్ మూవీ ప్రొడ్యూసర్ సూర్య దేవరనాగవంశీ ఈ మూవీ రషెస్ ను చూస్తున్న ఫొటోస్, వీడియోస్ ను విడుదల చేశారు.ప్రస్తుతం ఇవి నెట్టింటా వైరల్ అవుతున్నాయి.ఆర్.ఆర్.ఆర్ ప్రొడ్యూసర్స్ ఎంత రిక్వెస్ట్ చేసిన భీమ్లా నాయక్ నిర్మాతలు వెనక్కి తగ్గట్లేదు.దీంతో ఎస్.ఎస్ రాజమౌళి స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ మూవీ రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సిందగా రిక్వెస్ట్ చేయబోతున్నారని సమాచారం.
దీంతో పాటు ఆర్.ఆర్.ఆర్ ప్రొడ్యూసర్, దిల్ రాజు,యూవీ క్రియేషన్స్ నిర్మాతలు త్రివిక్రమ్ ను కలిసి రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సిందిగా పవన్ పై ఒత్తిడి తేవాలనే ఆలోచనలో ఉన్నారు.మరి దీనికి పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.