షారుక్ ఖాన్ పఠాన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షారుక్ ఖాన్ కి జోడీగా దీపికా పదుకునే నటించింది. ఇక ఈ సినిమా నుంచి బెషారమ్ రంగ్ అనే సాంగ్ ని కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ లో దీపికా పదుకునే అందాల ప్రదర్శన శ్రుతిమించి ఉంది. బికినీలో అంగాంగ ప్రదర్శన చేసింది. దానికి తోడు ఓ సన్నివేశంలో షారుక్ ఖాన్ దీపికా పదుకునే ని హగ్ చేసుకుంటాడు. అక్కడ ఆమె కాషాయం రంగు బికినీ ధరించింది. ఆ సాంగ్ లో విజువల్స్ అన్ని కూడా జుగుప్సాకరంగా ఉన్నాయని, దీపికా పదుకునే నగ్న ప్రదర్శన చేసినట్లు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే కాషాయం రంగు బికినీ ధరించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా బీజేపీ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు.
ఆ సాంగ్ ని వెంటనే తొలగించకపోతే తక్షణం సినిమాని బ్యాన్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో హిందువుల మనోభావాలని కించపరిచారు అంటూ ట్విట్టర్ లో బ్యాన్ పఠాన్ మూవీ, బ్యాన్ బాలీవుడ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ పైన పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేయడంపై బాలీవుడ్ సెలబ్రిటీలు సీరియస్ అవుతున్నారు. అలాగే సెక్యులర్ ముసుగులో హిందుత్వ వ్యతిరేకులు అందరూ కూడా షారుక్ ఖాన్ ని సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ సాంగ్ కి మించి కాషాయం బట్టలు ధరించి గతంలో హీరోయిన్స్ డాన్స్ లు చేసారని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకంటూ విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సాంగ్ పై ముస్లిమ్ సంగాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. ఆర్టీఐ కార్యకర్త డానిష్ ఖాన్ ‘బేషరమ్ రంగ్’పై మానవహక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. పాటను నుంచి తొలగించేలా ఆదేశించాలని కోరారు. ఈ సాంగ్ ముస్లింలు పవిత్రంగా భావించే కాషాయం రంగుని కించపరచడంతో పాటు హిందూ, ముస్లిం ఐక్యతని దెబ్బ తీసే విధంగా అశ్లీలంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో సాంగ్ ని నిషేధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ సాంగ్ పట్ల హిందువులతో పాటు ముస్లిం సంఘాలలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండటం విశేషం.