2011 లో భారత్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అప్పటి భారత్ కోచ్ గ్యారీ క్రిస్టన్ ఆతరువాత ఏ టీమ్ కు కోచ్ గా వ్యవహరించిన ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు.అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న ప్రచారం మేరకు పాకిస్తాన్ కోచ్ గా గ్యారీ క్రిస్టన్ ను ఎంపిక చేసే ఆలోచనలో పిసిబి చీఫ్ రమీజ్ రాజా ఉన్నారట.అయితే ఈ రేసులో గ్యారీ క్రిస్టన్ తో పాటు ఆసీస్ మాజీ ప్లేయర్ సైమన్ కటిచ్,పీటర్ మూర్స్ కూడా ఉన్నారు.
మరి ఈ ముగ్గురిలో పాకిస్తాన్ కోచ్ గా వ్యవహరించే అవకాశం ఎవరికి వస్తుందో,టి20 తప్ప మిగతా అన్ని ఫార్మాట్స్ లో పేలవ ప్రదర్శనతో నిలుస్తున్న పాకిస్తాన్ ను కొత్త బాధ్యతలు చెప్పటే కోచ్ ఎలా తీర్చిదిద్దుతారో వేచి చూడాలి