Oramax Media: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది. ముఖ్యంగా హీరోల కన్నా వారి అభిమానుల మధ్య ఇలాంటి పోటీ భారీగా ఉంటుందని చెప్పాలి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున అభిమానులు తమ హీరోల గురించి. ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రతినెల అత్యంత ఆదరణ పొందిన నటీనటుల జాబితాలను విడుదల చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ప్రతినెల అత్యంత ప్రజాదరణ పొందిన హీరో హీరోయిన్ల గురించి ఓర్ మ్యాక్స్ సర్వే చేస్తూ ఆ జాబితాలను విడుదల చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆగస్టు నెలకి సంబంధించిన జాబితాను కూడా విడుదల చేశారు. ఈ నెలలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోలలో నెంబర్ వన్ హీరోగా కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి చోటు సంపాదించుకోగా హీరోయిన్ గా సమంత చోటు సంపాదించుకున్నారు.
ఇక నెంబర్ వన్ స్థానంలో విజయ్ దళపతి ఉండగా నెంబర్ 2 స్థానంలో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, యశ్ వరుసగా ఐదు స్థానాల్లో ఉన్నారు.అయితే ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ కి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా అభిమానులు భావిస్తుంటారు.
Oramax Media: నిరాశ వ్యక్తం చేస్తున్న టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల అభిమానులు..
ఇకపోతే తాజాగా ఓర్ మ్యాక్స్ సర్వేలో భాగంగా నెంబర్ వన్ స్థానంలో విజయ్ పేరు ఉండటం చూసిన ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఈ హీరోలలో ఒకరి పేరు ఉండాల్సింది పోయి కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే స్టార్ హీరోగా పరిమితమైన విజయ్ పేరు ఉండడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సర్వేలో భాగంగా నెంబర్ వన్ హీరో విషయంలో ఓర్ మ్యాక్స్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిందనే చెప్పాలి.