ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అయితే క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక పాషన్. ముఖ్యంగా పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ అవుతుంది అంటే టీవీలకి జనాలు అతుక్కుపోతారు. ఇక క్రికెట్ మ్యాచ్ లో కోట్లాది రూపాయిల బెట్టింగ్ కూడా జరుగుతుంది. ఇక ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్ లు ఉండేవి. తరువాత వన్డేలు వచ్చాయి. 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ కి మంచి ఆదరణ వచ్చింది. అయితే ఈ వన్డే క్రికెట్ కూడా ఆరంభంలో నెమ్మదిగా ఉండేది. ఒక జట్టు 250 స్కోర్ చేస్తే ఛేదించడం కష్టంగా దశాబ్దం క్రితం ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు క్రికెట్ లో వేగం పెరిగింది. ఆటగాళ్లు తమ ఆటతీరుని మార్చుకుంటూ రావడం మొదలు పెట్టారు.
బ్యాటింగ్ లో స్పీడ్ పెరిగింది. దీంతో పరుగుల ప్రవాహం మొదలైంది. ఈ రోజుల్లో 300 పరుగులు చేసిన అతి పెద్ద టార్గెట్ అయితే కాదు. 350 పరుగులు కూడా చేధించేస్తున్న జట్లు ఉన్నాయి. దీనికి కారణం క్రికెట్ ప్రపంచంలోకి పొట్టి ఫార్మాట్ ఎంట్రీ ఇవ్వడం. క్రికెట్ ప్రేమికులని మరింతగా ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో 20-20 ఫార్మాట్ ఎంట్రీ వచ్చింది. ఈ ఫార్మాట్ వచ్చాక ఆటగాళ్ల ఆటతీరు మరింతగా మారిపోయింది. క్రీజ్ లో ఉన్నంత సేపు వీలైనన్ని ఎక్కువ పరుగులు కొట్టడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఇదే ఫార్మాట్ లో ఇండియాలో దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ వచ్చిన తర్వాత ఆటగాళ్ల ఆటతీరు మరింతగా మారిపోయింది.
ఎటాకింగ్ బ్యాటింగ్ ఆడవారికి బాగా గుర్తింపు లభిస్తుంది. అలాగే బౌలింగ్ లో కూడా అదే స్థాయిలో ఎటాకింగ్, స్పీడ్, నైపుణ్యం ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. ఈ నేపధ్యంలో సిక్స్ లు, ఫోర్ లు కొట్టడం ఆటగాళ్లకి చాలా ఈజీ అయిపొయింది. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్ ఆరు బంతులలో ఆరు సిక్స్ లు అనేది ప్రపంచ రికార్డ్ గా ఉంది. ఇది యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్ పేరు మీదుగా ఉంది.
అయితే తాజాగా ఇండియన్ దేశవాళీ మ్యాచ్ లో వర్ధమాన ఆటగాడు రుతురాజ్ గౌక్వాడ్ ఏకంగా ఒక ఓవర్ లో ఏడు సిక్స్ లు కొట్టి అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇందులో ఒక నో బాల్ఉండటం, దానిని కూడా రుతురాజ్ సిక్స్ గా మలచడంతో ఈ రికార్డ్ సాధ్యం అయ్యింది. ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ ని ఒకే ఓవర్ లో ఏడు సిక్స్ లు కొట్టడం అనేది ఇదే మొదటి సారి. దీంతో అరుదైన రికార్డ్ ని ఇది నిలిచిపోయింది. ఈ మహారాష్ట్ర ఆటగాడు ముంబైలో ఈ ఏడు సిక్స్ లతో 159 బంతులతో ఏకంగా 220 పరుగులు చేయడం విశేషం.