Om Raut: బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్.ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి చిత్ర బృందం బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ లుక్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెతుతున్నాయి. అయితే ఈ విమర్శలపై దర్శకుడు ఓం రౌత్ స్పందిస్తూ రావణాసురుడిని ఆ విధంగా చూపించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓం రౌత్ మాట్లాడుతూ… రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి ఆయన లుక్ తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించగలగాలి.
గతంలో రామాయణం నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ సినిమాలలో రావణాసురుడు పొడవాటి చుట్టు కలిగి ఎంతో గంభీరంగా కనిపించి ఉండవచ్చు. అయితే ప్రస్తుత జనరేషన్ వారికి,భవిష్యత్తు తరాల వారికి రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి చేరాలని అనుకుంటున్నాము అందుకే రావణాసురుడి పాత్రను చాలా క్రూరంగా చూపించామని ఈయన క్లారిటీ ఇచ్చారు.
Om Raut: టీజర్ చూసి సినిమాని అంచనా వేయొద్దు..
ఇక రావణాసురుడు పక్షి పై రావడం ఏంటి అనే ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే కేవలం రెండు నిమిషాల టీజర్ చూసి సినిమా ఏ మాత్రం బాగాలేదని ఎవరు అంచనాలకు రావద్దని సినిమా చూసిన తర్వాత వీరి లుక్స్ ఇలా డిజైన్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం అందరికీ అర్థమవుతుందని ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ విమర్శలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి ఈ సినిమా థియేటర్లో విడుదలై ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.