Old Currency: గతంలో రద్దయిన నోట్లు మీలో ఎంత మంది దగ్గర వున్నాయి? వాటిని మార్చే స్వామిజీ అడ్రస్ చెబుతాం వెళ్లి మార్చుకోండి. ఎంటి నిజం అని నమ్ముతున్నారా నమ్మితే జైలు లో చిప్పకూడు తినాల్సిందే. ఇలాంటివి నమ్మి కొంత మంది బొక్కబోర్లా పడ్డారు. వివరాల్లోకి వెళితే గతంలో మన మోడీ గారు రద్దు చేసిన నోట్లు మరియు, దొంగ నోట్లను తరలిస్తున్న ముఠా ఒకటి పోలీసులకు దొరికిపోయింది ఈ నోట్ల విలువ రూ.1.65 కోట్లు.వీరిని ములుగు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ వెల్లడించారు.
గురువారం పోలీసులు వెంకటాపురం వద్ద సాదారణ తనిఖీలు చేస్తుండగా రెండు వాహనాల్లో రద్దయిన రూ.వెయ్యి, రూ.500 నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్ల విలువ సూమారు రూ.1.65 కోట్ల విలువ కలిగినవి. సూర్యాపేట జిల్లా కేశవాపూర్ కు చెందిన పప్పుల నాగేంద్రబాబు, భద్రాచలం ఏఎంసీ కాలానికి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురంకి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధనగర్ కు చెందిన ఆయుర్వేద వైద్యులు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ నోట్ల కథ పెద్ద సినిమా స్టోరీ ని తలపిస్తోంది. నిందితుడు అయిన నాగేంద్రబాబుకు అప్పులు ఎక్కువ కావడంతో తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభం వచ్చే పని చేయాలని ప్లాన్ చేసాడు. సలహా కోసం తన ఫ్రెండ్ నాగలింగేశ్వరరావును కలిశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ రద్దయిన నోట్లు ఇస్తే వాటిని కొత్త నోట్లుగా మారుస్తారని నాగ లింగేశ్వరరావు నాగేంద్రబాబు కు నమ్మకంగా చెప్పాడు. దీని వల్ల డబ్బు బాగా వస్తుంది అని అనుకున్న నాగేంద్రబాబు అదే పనిలో పడ్డాడు. తనకు తెలిసిన వారందరికీ చెప్పాడు.
Old Currency:
తన ఫ్రెండ్స్ నుంచి కొన్ని రద్దయిన నోట్లు సేకరించాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డి దగ్గర పాత నోట్లు వున్నాయని తెలిసి వాళ్ళను కలిశాడు.వారికి రూ. ఐదు లక్షల చెలామణి అవుతున్న నోట్లు ఇచ్చి వారి వద్ద సుమారు రూ. 2 కోట్ల పాత నోట్లు, కొన్ని దొంగనోట్లను తీసుకున్నాడు. ఆ డబ్బును భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. వారినుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్ లు, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ట్విస్టు ఎమిటంటే అసలు ఐడియా చెప్పిన దొంగ స్నేహితుడు ఇంకా దొరకలేదు.