యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. టైం ట్రావెల్ ఎలిమెంట్ తో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. గత కొంత కాలంగా శర్వానంద్ నుంచి వస్తున్న సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కొత్తదనం ఉన్న కాన్సెప్ట్ లతోనే వస్తున్న ఎక్కడో ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ మిస్ కావడంతో శర్వానంద్ సినిమాలు థియేటర్స్ లో వర్క్ అవుట్ కావడం లేదు. అయితే హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అతని సినిమా ప్రయాణం ఉంటుంది. తన మనసుకి దగ్గరయ్యే కథలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు.
అందుకే శర్వానంద్ నుంచి క్లాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కంటెంట్ మూవీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సారి కూడా అలంటి కథాంశంతోనే ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపధ్యంలో ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకుంటుంది. ఎస్.ఆర్ ప్రభు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఉన్నాడు. అమల అక్కినేని కీలక పాత్రలో నటించారు. అలాగే వెన్నెల కిషోర్, ప్రియదర్శి హీరో స్నేహితులుగా కనిపించారు.
తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమపై అంచనాలని పెంచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా వర్క్ అవుట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ ఎలిమెంట్స్ చాలా పెర్ఫెక్ట్ గా ఉన్నాయనే మాట వినిపిస్తుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి హ్యూమన్ ఎమోషన్స్ జోడించి కథని చెప్పడం సరికొత్త పాయింట్ గా ఉందని ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన. ఇక సినిమాలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, వారు కనిపించి ప్రతి సన్నివేశంలో ఆడియన్స్ నవ్వుకునేలా ఫన్ జనరేట్ చేశారని తెలుస్తుంది.
ఇక హీరోగా శర్వానంద్ తన పాత్రలో అద్భుతంగా నటించాడని, అలాగే చాలా గ్యాప్ తర్వాత అమ్మ పాత్రలో నటించిన అమలా కూడా కన్నీళ్లు పెట్టించేలా పెర్ఫార్మెన్స్ చేసిందని ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన. సంగీతం కూడా సినిమాకి మంచి ఎస్సెట్ అయ్యిందని. దర్శకుడు శ్రీ కార్తీక్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా అయినా అద్భుతమైన నేరేషన్ తో సినిమాని నడిపించి ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా కథని నడిపించాడనే మాట వినిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి కథ అంతగా కనెక్ట్ అయ్యే అవకాశాలు లేకుండా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి నచ్చుతుందని, అలాగే ఫీల్ గుడ్ సినిమాలుఇష్టపడే వారికి ఒకే ఒక జీవితం బాగా నచ్చుతుంది అని టాక్ వినిపిస్తుంది. ఓవరాల్ గా శర్వానంద్ ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ఒక సక్సెస్ ని ఖాతాలోవేసుకున్నాడని మాట బలంగా వినిపిస్తుంది.