YCP visit: సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. కుప్పంను టార్గెట్ చేసిన జగన్.. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కుప్పం వెళ్లిన చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, దాడికి పాల్పడటం తీవ్ర దుమారం రేపింది. ఇలాటి తరుణంలో జగన్ కుప్పం పర్యటన అక్కడి రాజకీయాల్లో వేడి పెంచింది. ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత కుప్పంలో ఏర్పాటు చేశారు. కుప్పంలో భారీగా పోలీసులు మోహరించారు.
పకడ్బందీ భద్రత మధ్య కుప్పం పర్యటనకు జగన్ వెళ్లారు. కుప్పంలో జగన్ పర్యటనకు భారీగా జనసమీకరణ చేయాలని వైసీపీ నానా ప్రయత్నాలు చేసింది. వైఎస్సార్ చేయూత డబ్బులను విడుదల చేసేందుకు కుప్పంకు జగన్ వచ్చారు. ఈ సంరద్బంగా బహిరంగ సబ ఏర్పాటు చేశారు. ఈ సభకు వైసీపీ శ్రేణులను తరలించేందుకు జిల్లాలోని స్కూళ్లను బెదిరించి వైసీపీ నేతలు బస్సులు లాక్కున్నారు. ప్రజలు బయటకు రాకుండా కుప్పం నియోజకవర్గంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు.
YCP visit:
స్ధానికులు బయటకు వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇఫ్పటికే కుకప్పంలోని స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. కుప్పం పట్టణంలో రోడ్డు మొత్తం తవ్వేసి బారికేడ్లు పెట్టారు పోలీసులు. సభకు తప్పనిసరిగా రావాలని జిల్లాలోని డ్వాక్రా మహిళలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు, సబకు రాకపోతే రూ.500 ఫైన్ విధిస్తామని హుకూం జారీ చేశారు. అలాగే సభకు జనాలను తీసుకెళ్లేందుకు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఇచ్చి జనాలను సభకు తరలిస్తున్నారు. అలాగే సభ మద్దలో జనాలు బయటకు వెళ్లకుండా వైసీపీ నేతలు అధికారులతో కలిసి చర్యలు తీసుకున్నారు. జగన్ కుప్పం పర్యటనలో వైసీపీకి అడ్డంకులు వస్తున్నాయి. జనాలను తరలించేందుకు స్ధానిక పార్టీ నేతుల నానా తంటాలు పడుతున్నారు.జనసమీకరణకు చాలా ఇబ్బందలులు పడుతున్నారు.