Obesity: ఆహారాన్ని మించిన ఔషధం లేదు. అవును ఇది మితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషం. ఇది ఎదో ఒక సినిమాలో డైలాగ్ లాగా ఉందే అనుకోకండి. ఇది నిజం. ఎంత తింటున్నాం అనేది మాత్రమే కాదు,ఏ సమయంలో తింటున్నాం,ఎలాంటి పదార్థాలు తింటున్నాం అనేది కూడా ఇక్కడా చూడాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినటం మనలో చాలా మందికి అలవాటు అయ్యింది. ఇది ఆరోగ్యానికి చేటు అంటున్నారు నిపుణులు.
వేళాపాళా లేకుండా తింటే ఆరోగ్యానికి పెద్ద సమస్యే..
ప్రపంచం చిన్న గ్రామంగా మారడంతో ఇక్కడ వాళ్ళు అమెరికా కంపెనీలకి పని చేయడం మొదలుపెట్టారు. అమెరికా కంపెనీలు కాబట్టి వాళ్ళ సమయానుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. దీంతో అర్థరాత్రి పని చేయడం ఎప్పుడో తినడం చాలామందికి అలవాటు అయ్యింది. కొంతమంది అర్థరాత్రి పూట వెళ్ళి టిఫిన్లు కూడా తినేవారు ఉన్నారంటే అర్థం చేసుకోండి ఈ అలవాటు ఎలా ఉందో.
ఒక మంచి రొటీన్ ఉండడం మంచిదంటారు డాక్టర్లు. ఒక సమయానికి లేవడం,సమయానికి తినడం మంచిదని ఇలా చేయడం ద్వారా ఆహారం బాగా జీర్ణమవుతుందని అధిక బరువు కలగకుండా ఉండటానికి ఉపయోగపడుతుందట. అలా కాకుండా అర్థ రాత్రి పూట తిండి తినడం ద్వారా అధిక బరువు కలుగుతుందని,దీర్ఘకాయం వస్తుంది అంటున్నారు డాక్టర్లు.
Obesity:
క్రమశిక్షణ ఉన్న దినచర్య కలిగి ఉండటం మంచిదని,ఆరోగ్యం సరిగా ఉంచుకోవడానికి ఇది శ్రేష్టం అంటున్నారు డాక్టర్లు. తినడానికి పడుకోవడానికి ఒక సమయం ఉండాలట. అర్థరాత్రి పూట ఎక్కువగా తినడం మంచిది కాదు. రాత్రి పూట ఆహారం జీర్ణమవడం కష్టం. దీంతో అధిక బరువు అది కాస్తా ఒబేసిటీ గా మారుతుందట. సమయానికి తినడం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలట. జంక్ ఫుడ్స్,మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం దూరంగా పెట్టాలట.