Biggboss 6 : బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్-6 సిద్ధమైంది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఆరో సీజన్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. సీజన్-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచుతున్నారు. ఈ క్రమంలోనే నాగ్ వైట్ అండ్ వైట్‌లో ఎంట్రీ ఇచ్చారు. కొత్త కంటెస్టెంట్‌లకు స్వాగతం పలికేందుకు హౌస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటి వరకూ జరిగిన ఐదు సీజన్లతో పాటు ఓటీటీలో వచ్చిన సీజన్ కంటే భిన్నంగా హౌస్‌ను నిర్వాహకులు అరేంజ్ చేశారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా ‘కార్తీక దీపం’ ఫేమ్ కీర్తి అదేనండి.. మన హిమ ఎంట్రీ ఇచ్చింది. ఇక సెకండ్ కంటెస్టెంట్‌గా సుదీప అదేనండి మన పింకీ ఎంట్రీ ఇచ్చింది. ఓ అద్భుతమైన ఏవీతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. తనను ఎక్కడికెళ్లినా పింకీ అనే పిలుస్తారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రుల దగ్గరే కూచిపూడి నేర్చుకున్నట్టు వెల్లడించింది. తన లవ్ స్టోరీ గురించి కూడా పింకీ తెలిపింది. తనకంటే తన భర్త చాలా మొండివాడని.. అలా అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని వెల్లడించింది. ఇప్పటి వరకూ తనను ఎంతగానో అంతా ఆదరించారని.. ఇకపై కూడా ఆదరిస్తారని ఏవీలో కోరింది.
Biggboss 6 : ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న సుదీప
పింకీతో నాగ్ సంభాషణ చాలా ఆసక్తికరంగా మారింది. తనను ఇంట్లో వాళ్లు మాత్రమే సుదీప అని పిలుస్తారని వెల్లడించింది. అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చే సమయానికి అందరి చేత సుదీప అని పిలిపిచ్చుకోవాలని నాగ్ తెలిపారు. పింకీ అంటే తననొక చిన్న పిల్లలాగే చూస్తారని చెప్పుకొచ్చింది. నాగ్‌తో రెండు సార్లు అవకాశం వచ్చినా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. కొన్ని పదాలకు ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలంటే.. సుదీప చూపించిన తీరు ఆకట్టుకుంది. మొత్తానికి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సుదీప కూచిపూడి డ్యాన్సర్ అనిపించుకుంది. ఇక పింకీ 6 నంబర్ ఉన్న కార్డును ఎంచుకుంది. దానిలో బ్లాంక్ ఉంది.