NTR30: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. రామ్ చరణ్‌తో కలిసి ఈ మూవీలో అద్భుతమైన నటన కనబరిచారు ఎన్టీఆర్. కెరీర్ ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత నటన పరంగా, డ్యాన్స్ పరంగా ఎన్టీఆర్ చాలా మెరుగయ్యారు. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో తన మార్కెట్‌ను రోజురోజుకూ పెంచుకుంటున్నాడు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అంతే స్థాయిలో పెరిగింది. కెరీర్ మధ్యలో చాలా అపజయాలు చవిచూసినా బెదరకుండా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు సాగిపోతున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ జరుగుతుండగానే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రకటించారు. కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, కొన్ని అనివార్య కారణాలతో ఈ మూవీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆలస్యం కావొచ్చు, కరోనా దెబ్బ కావొచ్చు.. ఇలా అనేక కారణాలతో సినిమా ఆలస్యమవుతోంది. ఓ దశలో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్30 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని, త్వరలోనే పట్టాలెక్కుతుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టినట్లయ్యింది. ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి బంపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
NTR30: టైటిల్‌పై అనేక రకాల పుకార్లు..
ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న రెండో మూవీ కావడంతో ఈ సినిమా టైటిల్‌పై అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి. కొందరు దీనికి రుద్ర అనే టైటిల్ పెడతారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు దేవర అనే టైటిల్ కూడా పెడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. దేవర అనే టైటిల్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను బండ్ల గణేష్ దేవర అని పిలుస్తుంటారు. ఈ టైటిల్‌ను పవన్ కోసం ఇప్పటికే బండ్ల రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. మరి టైటిల్‌పై చిత్ర బృందం క్లారిటీ ఇస్తే తప్ప ఇలాంటి పుకార్లు ఆగేలా లేవు.