NTR: మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” మరియు యంగ్ టైగర్ “జూనియర్ ఎన్టీఆర్” లు ప్రధాన పాత్రదారులుగా దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన చిత్ర శిల్పమే “RRR”. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పొందిన విజయం తెలుగు సినిమాకి అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. హాలీవుడ్ తో పాటు ప్రపంచం నలుమూలల సినీ ప్రేమికులు, రైటర్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ మూవీ ఇటీవల ఆస్కార్ అవార్డుకు నామినేట్ కాకపోవడంతో అభిమానులను నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ ఈ సినిమా విశ్వవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందిందనేది కాదనలేని నిజం.
ఇక RRR మూవీ తర్వాత ఇటు రామ్ చరణ్.. అటు ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఆయా హీరోల అభిమానులు వారి హీరో తదుపరి చిత్రం కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే RRR మూవీతో వచ్చిన క్రేజ్ తో తన 15వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పట్టాలెక్కించాడు రామ్ చరణ్. కాగా ఆ చిత్రంలోని పలు కీలక సన్నివేశాల షూటింగ్ కూడా అయిపోయినట్టు సమాచారం. త్వరలో ఆ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తున్నాడు. తన 30వ ప్రాజెక్ట్ ని ఇంకా పట్టాలెక్కించక పోవడమే ఇందుకు కారణం. అయితే ‘RRR’ తరువాత ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివతో భారీస్థాయిలో ఒక పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నటు ప్రకటించిన ఇప్పటికే ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన ఏ ఇతర సమాచారం లేకపోవడంతో అభిమానులు ఒకింత నిరాశకు లోనవుతున్నారు.
NTR:
ఇటీవల ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా.. మే 20 తేదీన ఈ మూవీకి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో “వస్తున్నా..” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో ఫాన్స్ కొంత మేర తృప్తి చెందారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. పురాణగాథ ఆధారంగా ఉంటుందని సమాచారం. అప్పట్లో ‘గరుడ పురాణం’ ఆధారంగా దర్శకుడు శంకర్ తీసిన మూవీ ‘అపరిచితుడు’. ఈ సినిమా సంచలన విజయం పొందింది. ఎన్టీఆర్ – కోరటాల శివ మూవీ కూడా ‘గరుడ పురాణం’ ఆధారంగా తీస్తున్నారు. దీనితో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అంటూ అభిమానులు హడావిడి చేస్తున్నారు.