NTR: తెలుగు సినిమా రంగంలో ఇంకా రాజకీయ రంగంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన కుటుంబంగా చాలామంది నందమూరి కుటుంబాన్ని అభివర్ణిస్తారు. ఇండస్ట్రీలోనే నందమూరి ఫ్యామిలీ అతిపెద్దది. దీంతో ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు అయినా నందమూరి కుటుంబానికి సంబంధించి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటది. ప్రతి కార్యక్రమానికి నందమూరి కుటుంబం నుంచి దాదాపు అందరూ హాజరవుతూనే ఉంటారు. అయితే కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఎన్టీఆర్ కనిపిస్తూ ఉంటారు. మరి కొన్ని కార్యక్రమాలలో ఎన్టీఆర్ కనిపించారు.
తాజాగా నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ వివాహం హైదరాబాద్ లో చాలా ఘనంగా జరిగింది. చైతన్య కృష్ణ పెళ్లికి ఆల్మోస్ట్ ఆల్ నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. కానీ ఒక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారింది. ఈ వార్తపై కొంతమంది అభిమానులు కావాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది ఎన్టీఆర్ పెళ్లికి హాజరై కెమెరాల ముందు కనబడలేదేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ కనిపించకపోవడం పట్ల నందమూరి అభిమానుల సైతం పెద్ద డిస్కషన్ లు పెట్టుకుంటున్నారు. ఇంకా ఇదే కార్యక్రమానికి నందమూరి కళ్యాణ్ రామ్ తన కుటుంబంతో కలిసి రావడం జరిగింది. దీంతో ఒకవేళ చైతన్య కృష్ణ వివాహానికి ఎన్టీఆర్ నీ ఆహ్వానించకుంటే మరోసారి నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ని కావాలని దూరం పెడుతున్నట్లుగానే భావించవచ్చని ఫ్యాన్స్ ఇన్ సైడ్ టాక్.