యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో మర్చిపోలేని మైలురాయిగా నిలిచిన చిత్రం ఆది.ఆరోజులలో ఈ మూవీ 98 సెంటర్లలో 100 రోజుల పాటు ఆడింది.ఈవీవీ సత్యనారాయణ, సాగర్, క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన వివి వినాయక్ ఈ మూవీతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు.ముందుగా ఈ మూవీని వివి వినాయక్ బాలయ్యతో చేయాలనుకున్నారు. దానికోసం ఆయన ఒక వెర్షన్ ను కూడా సిద్ధం చేసుకున్నారు.ఈ వెర్షన్ లో ఇద్దరు బాలయ్యలు ఉంటారు అందులో ఒకడు చిన్నప్పుడు విలన్ మీద బాంబులు వేస్తాడు.ఆతరువాత వీరిలో పెద్ద బాలయ్య పోలీస్ అయ్యి చిన్నవాడిని కొడతాడు.
కానీ వివి వినాయక తలచింది జరగలేదు.ఈ మూవీలోకి ఎన్టీఆర్ వచ్చాడు.దీంతో వివి వినాయక్ కథలో కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ అప్పట్లో ఒక పెద్ద మ్యూజికల్ హిట్ అయ్యింది.ఇక తొలి చిత్రంతో అబ్బాయికి హిట్ ను అందించిన వివి వినాయక్ ఆతర్వాత తన రెండో చిత్రం చెన్నకేశవ రెడ్డి మూవీని బాలయ్యతో చేసి హిట్ ను అందుకున్నారు.