ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందిస్తున్నాడు.ఈ మూవీ కోసం తాజాగా దర్శకుడు హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేయిస్తున్నారు.ఇందులో త్వరలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు.ఈ మూవీలో ఎన్టీఆర్ తో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నది.అయితే తాజాగా ఈ మూవీలో అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ మరో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ ఇది కానీ నిజమైతే జాహ్నవి కపూర్ కు తెలుగులో మంచి లాంచ్ దొరుకుతుంది.