కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన మూడు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. చివరిగా జరిగిన దానిలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం అయ్యారు.

ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్‌తో పాటు మేజర్ హైలైట్ పాయింట్‌పై ఓ క్రేజీ న్యూస్ లీకైంది.సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’ మూవీలో సముద్రంపై వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా ప్లాన్ చేశారట. అందులో ఒకటి సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ మధ్య నీటి అడుగు భాగంలో జరుగుతుందని తెలిసింది.
ఇందులో ఎన్టీఆర్ డూప్ లేకుండానే రిస్క్ చేయబోతున్నాడని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను మరికొద్ది రోజుల్లోనే జరగనున్న షెడ్యూల్‌లో షూట్ చేస్తారని అంటున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ వాటర్ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.